బస్సు ప్రమాదాల చరిత్రలో కొండగట్టు ప్రమాదం అత్యంత విషాదకర ఘటనగా నిలిచింది. ఈ ప్రమాదంలో ఏకంగా 62 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో మేల్కొన్న అధికారులు నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో భాగంగా కొండగట్టు ఘాట్ రోడ్డును వన్ వే చేయాలని నిర్ణయించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ శనివారం(అక్టోబర్ 7)న సమీక్ష‌ జరిపారు. ఘాట్ రోడ్డును పూర్తిగా మూసేస్తే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటారని..

దీంతో ఎగువ మార్గంలో టూ వీలర్స్ ను అనుమతించాలని కలెక్టర్ అన్నారు. గుట్ట పై నుంచి కిందకు వచ్చే రూట్ లో టూ వీలర్స్ తో సహా ఎలాంటి వాహనాలను అనుమతించేది లేదని, ప్రత్యామ్నాయ మార్గంలో వాహనాలను అనుమతించాలన్నారు. కిందకు వచ్చే మార్గంలో భద్రతా సిబ్బందిని ఉంచాలని, టర్నింగ్ పాయింట్స్, స్పీడ్ బ్రేకర్ల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

Advertisements