రంగారెడ్డి : రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్‌లో పట్టపగలే దారుణ హత్య జరిగింది. నడిరోడ్డుపై నడుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై మరో ఇద్దరు వ్యక్తులు కలిసి గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దారుణ సంఘటన అత్తాపూర్‌లోని పిల్లర్ నంబర్ 138 వద్ద చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికారు. సుమారు 10 నుంచి 15 సార్లు గొడ్డలితో నరికినట్లు స్థానికులు చెబుతున్నారు. అతడు చనిపోయాడని నిర్ధారించుకునేంత వరకు గొడ్డలితో దాడి చేశారు. స్థానికులు అడ్డుకునేందుకు యత్నించినా.. హంతకులు ఆగలేదు.

పోలీసులను చూసి కూడా భయపడని హంతకులు.. వారు వచ్చిన తర్వాత కూడా గొడ్డలితో నరికారు. ఈ హత్యలో నలుగురు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. హత్యకు గురైన వ్యక్తిని రమేశ్‌గా పోలీసులు గుర్తించారు. అయితే రమేశ్ గతంలో బేగంబజార్‌కు చెందిన మహేశ్ అనే వ్యక్తిని ఆరు నెలల క్రితం శంషాబాద్‌లో మర్డర్ చేశాడు. ఈ కేసులో రమేశ్ ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరై తిరిగి వెళ్తున్న క్రమంలో పిల్లర్ నంబర్ 138 వద్ద మాటువేసిన మహేశ్ బంధువులు అతనిపై గొడ్డలితో దాడి చేసి మట్టుబెటారు

Advertisements